రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి 'ఇండియా' అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు.