తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం కానున్నారు.
అమరావతిలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశంపై రేపటి సభలోనూ పట్టు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, స్పీకర్ తమ్మినేని కామెంట్లపై సమావేశంలో చర్చించారు.
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.