Free Bus Scheme: మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది.. నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు రూ. 8459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారని మంత్రి ఓ ప్రకటన పేర్కొన్నారు.
READ MORE: Stock Market: ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
దీని ద్వారా కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన, హాస్పిటల్ చికిత్సలు, విద్య వ్యవస్థ మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుని ఇంకా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు..
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్న ఈ పథకం రెండు సంవత్సరాలు గా విజయవంతంగా మహిళా సాధికారత కి ఉపయోగపడుతుంది.. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు.. మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుంది.. తెలంగాణ అక్కా చెల్లెలకు, ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి రవాణా శాఖ మంత్రిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటనలో తెలిపారు..
READ MORE: RBI Cuts Repo Rate: హోమ్, కార్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ శుభవార్త.. తగ్గిన ఆర్‌బీఐ రెపో రేటు..