సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావుతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సభ తీర్మానాలు చేశారు. కుల ఘణన తీర్మానం చేసిన ఖర్గే కు ధన్యవాదాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రతి పార్లమెంట్ స్థానంలో మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ లకు 65 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించాలని, మైనారిటీలకు పదవుల్లో సరైన ప్రాధాన్యం కల్పించాలని తీర్మానాలు చేశారు.
Also Read : AAP Party: మరోసారి సుప్రీంకోర్టుకు ఆప్ సర్కార్.. కేంద్రానికి నోటీసులు
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు పార్టీకి దగ్గర కావాల్సిందేనన్నారు. పార్టీకి దూరమైన వర్గాలను పార్టీకి దగ్గర చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా సామాజిక న్యాయం జరగలేదని, బీఆర్‌ఎస్ బీసీ లను అణిచివేస్తుందన్నారు. ఒక కులం మాత్రమే ముందు పడితే ఏ పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీలో బీసీలకే ముఖ్యమంత్రి పదవులు వస్తున్నాయన్నారు.
Also Read : Janvi Kapoor : శారీలో హాట్ అందాలతో కైపేక్కిస్తున్న జాన్వీ కపూర్..
అనంతరం మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు బలం ఉన్న చోట టికెట్స్ ఇవ్వాలని ఆయన కోరారు. 60 శాతం టికెట్లు బీసీలకు కేటాయించాల్సిందేనని, ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి బీసీని గెలిపించుకోవాలన్నారు. త్వరలో బీసీ గర్జన నిర్వహిస్తామని, బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటిస్తుందని వీహెచ్ వెల్లడించారు.