Congress: మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోలే, తన అగ్రనేత రాహుల్ గాంధీని ‘‘శ్రీరాముడి’’తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ‘‘అతి భజన ప్రో మ్యాక్స్’’గా అభివర్ణించింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించకపోవడంపై అడిగిన ప్రశ్నకు నానా పటోలే సమాధానం ఇస్తూ.. ‘‘శ్రీరాముడు చేసిన పనినే రాహుల్ గాంధీ చేస్తున్నాడు’’ అని అన్నారు.
Madhavi Latha: రాజమౌళి దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారని బీజేపీ నాయకురాలు మాధవి లత పేర్కొన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నమ్మకాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందువులు తేరగా దొరుకుతున్నారా? రాముడికి ఒకే పెళ్లాం ఉంది అంటున్న రాజమౌళికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారు? అని ప్రశ్నించారు. కర్మ ఫలితం అనుభవించాడు కాబట్టే ఆంజనేయుడు లేడని అన్నాడు.. సినిమా చూసే మా వాళ్లకు బుద్ధి ఉండాలని హిందువులను ఉద్దేశించి అన్నారు. వందల కోట్లు సంపాదించిన నీవు.. బాహుబలి…