Lucky Bhaskar : ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాల్లో రూ.100కోట్లు కొల్లగొట్టిన సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయి అంతటా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి నాలుగు వారాల్లో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా రూ.వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి దుల్కర్ సల్కాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. అదే రోజు మరో రెండు సినిమాలు వచ్చి, పాజిటివ్ టాక్ దక్కించుకున్నా లక్కీ భాస్కర్ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. థియేటర్లో విడుదల అయిన సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ సైతం లక్కీ భాస్కర్ సినిమాకు విశేష స్పందన దక్కింది. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో ఇండియా వ్యాప్తంగా నెం.1 స్థానంలో లక్కీ భాస్కర్ ట్రెండ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలో జాతీయ స్థాయిలో నెం.1గా ట్రెండ్ కావడం చాలా అరుదు అది లక్కీ భాస్కర్ కు దక్కింది.
Read Also:Matka : డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్
సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా 15 దేశాల్లోనూ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులు లక్కీ భాస్కర్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల వీడియోలు వైరల్ కావడంతో సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో చూసిన వారు సైతం ఓటీటీలో మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ భాస్కర్‌కి డిజిటల్ ప్లాట్‌ఫాంపైనా లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్‌ను ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా చిత్ర దర్శకుడు లక్కీ భాస్కర్‌లో చూపించారు. అత్యంత గడ్డు జీవితం సాగిస్తూ, దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్నా బ్యాంక్ ఎంప్లాయి ఎలా తన తెలివితో బ్యాంక్ డబ్బును ఉపయోగించాడు. అతి పెద్ద స్కాం నుంచి ఎలా బయట పడ్డాడనేది ఈ సినిమా కథ. జీరో స్థాయి నుంచి వంద కోట్ల సంపాదన పొందే వరకు అతడి జర్నీ, చాలా తెలివైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు చూపించిన తీరు నిజంగా అద్భుతం. అందుకే జనాలు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
Read Also:UP: పెళ్లి ఊరేగింపులో దారి తప్పిన యువకుడు.. దొంగగా భావించి బడితపూజ