తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఇప్పటి వరకు అమరావతిలో 9, పొదిలి లో ఏడు, మాచర్లలో 6, విశాఖ, మచిలీపట్నం జంగమహేశ్వరంలో 5 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
READ MORE: Bhatti Vikramarka : బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే.. సమాజానికి మరింత ఉపయోగం
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పిడుగు పాటుకు నిన్న నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. కేవలం సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే ఉండండి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అంతేకాదు ప్రధానంగా మెరుపులు పడుతున్న సమయంలో ఇనుప తీగలకు దూరంగా ఉండాలి. బట్టలు తీయడానికి పై అంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్త. ఇనుముకు సంబంధించిన వస్తువులను తాకకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది తద్వారా ప్రాణాలు కోల్పోతారు.
READ MORE: Nandendla Manohar: “21 రోజుల్లోపే కొత్త కార్డులు”.. రేషన్ కార్డుల జారీపై మంత్రి కీలక ప్రకటన..
