Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది. Read Also: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ…
Cold Wave's: తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు సైతం పెరిగింది.
Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana Weather : తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Rekha Gupta: భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా…
Orange Alert : ఇవాళ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు చుట్టుముట్టాయి. వర్షం కారణంగా ఇప్పటికే పలు రహదారులు నీటమునిగిపోగా, ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైండ్ స్పేస్, ఐకియా చౌరస్తా, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, PVNR ఫ్లైఓవర్, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే మరోసారి హెచ్చరిక…
కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు…
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో…