Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
Kurnool Bus Incident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు తీసింది.. నిద్రలో ఉన్నవాళ్లు కళ్లు తెరవకుండానే సజీవ దహనం కావడం.. విషాదాన్ని నింపింది.. దీపావళికి సొంత ఊళ్లకు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేవాళ్లు.. ఇంటర్వ్యూల కోసం వెళ్లే వారు.. అక్కడే స్థిరపడిన వాళ్లు.. ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి.. అయితే, ఈ ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్.. రోడ్ ఇంజినీరింగ్… బస్…
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు..
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి…
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…
బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాపట్ల - గుంటూరు రోడ్ లోని నాగరాజు కాల్వలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. అయితే, గల్లంతైన యువకులు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన వాసులుగా గుర్తించారు.