తెలుగు రాష్ట్రాలను వరస వర్షాలు విడవకుండా襲ిస్తున్నాయి. గ్యాప్‌ల వారీగా విరుచుకుపడుతున్న వర్షాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా వాయుగుండం ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది.
ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట…
Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. UP: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు..…
Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు ఈ ద్రోణి మరింత బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు నేడు, రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.…
Hyd Rains : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలో రహదారులను జలమయం చేసింది. ట్రాఫిక్ నిలిచిపోయి, తక్కువ ఎత్తులోని ప్రాంతాలు నీటమునిగాయి. సికింద్రాబాద్‌లో ప్యారడైజ్, మర్రెడ్‌పల్లి, తార్నాక వంటి ప్రధాన రహదారులు వర్షపు నీటితో మునిగిపోయాయి. సాయంత్రం ఆఫీస్ సమయాల్లో వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు చక్రాల వాహనదారులు, పాదచారులు వర్షం నుండి తప్పించుకోవడానికి ఫ్లైఓవర్లు, దుకాణాల షేడ్ల కింద…
హిమాచల్‌ప్రదేశ్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరుసగా ఈ మధ్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. తాజాగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి.
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితపురం జలపాతం వద్ద జరిగిన ఒక ఘటన స్థానికులను కలవరపెట్టింది. అనుమతి లేకుండా ఈ జలపాతానికి వెళ్లిన వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలో దారి తప్పి చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు యువతులు, నలుగురు యవకులు ఉన్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని సురక్షితంగా కాపాడి, సమీపంలోని నుగూరు గ్రామానికి తరలించారు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల,…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.