Melioidosis Disease: పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది.
నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా... మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్…
రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. 10:40కి మాచర్ల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. యాదవుల బజారులో స్వఛ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఎస్.కె.బి.ఆర్. కాలేజీ గ్రౌండ్ లో ప్రజావేదికలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో ఉండవల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి..
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ,…
పల్నాడు జిల్లాలో కిరాతక ఘటన కలకలం రేపింది. నిద్రలో ఉన్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం జరిగింది. తీవ్ర గాయాలపాలైన వారిని తక్షణమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్య మంగమ్మ ప్రాణాలు కోల్పోయింది. భర్త శ్రీను పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. Also Read: Rainfall Deficit: తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం.. వచ్చే వారం చాలా కీలకం! ఈ దారుణ ఘటన నూజెండ్ల మండలం…
Train fraud AP: పల్నాడు జిల్లాలో నకిలీ టీటీఈ రైళ్లలో తిరుగుతున్నాడు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు.
పల్నాడు జిల్లా... వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.. నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని గత ఐదేళ్లు పూర్తిగా నష్ట పోయాం అన్నారు.. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు.. కానీ, వాలంటీర్లు కాదు అని స్పష్టం చేశారు..
Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.