Weather Updates : హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనున్నట్లు, ప్రత్యేకించి ఏపీతో పాటు.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తొక్కలతో.. పెరుగును మరింత పోషకమైనదిగా చేసిన బిహెచ్‌యు శాస్త్రవేత్త ఉమ్మడి…
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు.
గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత కూడా గంటపాటు విడవకుండా కురిసింది.
Telangana Weather Alert: రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది…
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపధ్యంలో, వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది.
Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. UP: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు..…
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.