దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 124 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ వర్షం శుక్రవారం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ నేడు (ఆదివారం) ఒక ప్రకటనలో భాగంగా.. సోమవారం (ఏప్రిల్ 14) రోజున రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర
భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించి�
గ్రేటర్ హైదరాబాద్తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకప�
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి.. మరో వైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అయితే, రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు.. మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.. మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగనుండగా.. మరోవైపు.. కొన్ని జిల్లాల�
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, �
ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది..
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది.
ఉత్తరప్రదేశ్లో బుధవారం ఆకాశంలో ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. భారీ శబ్దాలతో ఉరుములు రావడంతో జనాలు హడలెత్తిపోయారు. ఇక పిడుగుపాటుకు 38 మంది మరణించారు.
Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చాలా చోట్ల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.