తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల…
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి.