ఈ మధ్యకాలంలో సరిహద్దులు దాటిన ఓ ప్రేమకథను మీరు చూసే ఉంటారు. 2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ వచ్చారు. ఆమెతో పాటు తన నలుగురు పిల్లలను వెంట పెట్టుకుని సరిహద్దులు దాటారు. అయితే, అచ్చం సీమా హైదర్‌లాగే గత సంవత్సరం భారతీయ ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి ఇండియాకు కృష్ణ మండల్ అనే ప్రియురాలు చేరుకుంది. కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది.
Read Also: Minister Errabelli: ఎర్రబెల్లి దయాకరరావు క్యాంప్ కార్యాలయంలో కుప్పకూలిన భారీ వృక్షం
ఫేస్ బుక్ లో పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. కనీసం పాస్‌పోర్ట్ కూడా లేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది. ఆమె వస్తున్న దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ తన ప్రయాణం కొనసాగించింది. పులులు సంచరించే దట్టమైన అడవులు, ప్రవహించే నదులు వంటి ఆటంటకాలు ప్రేమ ముందు ఆమెకు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటన్నింటినీ దాటుకుని భారత్‌లో అడుగు పెట్టారు. కృష్ణ మండల్ కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ప్రజల కంటపడకుండా రహస్యంగా బెంగాల్‌కు చేరుకుని.. అక్కడ అభిక్‌ను కలుసుకుంది.
Read Also: Jacqueline Fernandez : బోల్డ్ ఫోటో షూట్ తో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..
ఈ ప్రేమికులు ఇద్దరు కోలకతాలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక తీరలేదు.. కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు.