అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా జరిగింది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. అత్యంత దారుణంగా భర్త కలిసి ప్రియురాలు హతమార్చింది. సంభాల్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడైనా బాయ్స్ హాస్టల్‌లోకి అమ్మాయిలు అనుమతి ఉండదు.. అలాగే ఉమెన్స్ హాస్టల్‌లోకి అబ్బాయిలకు అనుమతి ఉండదు. చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటిది ఒక విద్యార్థి.. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం తలెత్తకుండా సరికొత్త ఉపాయం ఆలోచించాడు.
ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్…
ప్రియురాలి హత్యకు ఓ న్యాయవాది ప్రయత్నించిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది.. న్యాయవాది అన్వర్ తన కారుతో బీభత్సం సృష్టించాడు.. తన ప్రియురాలు నసీమాపై హత్యాయత్నం చేశాడు.. ఆమె ప్రయాణిస్తున్న కారును తన కారుతో ఢీకొట్టిన అన్వర్.. కారుతో గుద్ది చంపేయాలని ప్రయత్నించాడు.. ఇక, ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న మరిన్ని వాహనాలను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయాడు..
Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్‌గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.
వారిద్దరూ మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. పై చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ కలిసి దూర ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. అయితే హఠాత్తుగా స్నేహితుడు హత్యకు గురయ్యాడు.
ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.