కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు.