కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస బ్లాక్‍బాస్టర్ సినిమా ల తో ఫుల్ ఫామ్‍లో ఉన్న స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవలే వచ్చిన లియో ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో వచ్చిన మాస్టర్ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబోలోనే లియో వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 19వ తేదీన లియో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది.అయితే భారీ స్థాయిలో చేయాలనుకున్న లియో ఆడియో లాంచ్‍ను మూవీ యూనిట్ ఆఖరి నిమిషంలో క్యాన్సల్ చేసింది. అయితే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను దుబాయ్ వేదికగా నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం అయితే ప్రమోషన్ల కార్యక్రమాలు బాగానే చేస్తోంది లియో సినిమా యూనిట్. ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
లియో చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్సులను విజయ్ ఫుల్ ఎనర్జీతో చేశారని, ఆయన ఫిట్‍నెస్ సీక్రెట్ ఏంటో కూడా లోకేశ్ కనగరాజ్ తెలిపారు.విజయ్ ఎక్కువగా ఆహారం తినరని ఆయన వెల్లడించారు. ప్రతీ రోజు తప్పకుండా విజయ్ 30 నుంచి 40 నిమిషాల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‍లు చేస్తారని లోకేశ్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా విజయ్ ఒకే రేంజ్‍లో శరీర బరువును మెయింటెన్ చేస్తున్నారని, ఆయన ఫిట్‍నెస్ మెరుగ్గా ఉండేందుకు ఇది కూడా కారణమని లోకేశ్ కనగరాజ్ తెలిపారు..లియో సినిమా కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ గా ఉంటుందా అనే విషయాన్ని మూవీ యూనిట్ ఇంకా సీక్రెట్‍గానే ఉంచుతోంది. అయితే, లోకేశ్ గత చిత్రాలకు లియోకు లింక్ ఉంటుందనే అంచనాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి అయితే, ఎల్‍సీయూలో లియో ఉంటుందా లేదా అని తాను ఇప్పుడే చెప్పబోనని లోకేశ్ తెలిపారు.. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేక్షకులు లియో సినిమాను ఎంజాయ్ చేయాలని, అందుకే ఎలాంటి హింట్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.