లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులతో ఓ యువకుడు బలయ్యాడు.
Read Also: Pocharam: సభ హుందాతనం కాపాడండి.. రెండు పక్షాలకు సూచన
వివరాల్లోకి వెళ్తే.. మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడాలో శివ (29)అనే యువకుడు లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్వస్థలం ఈస్ట్ గోదావరి. అయితే.. తల్లిదండ్రులతో కలిసి ఎల్లారెడ్డి గూడాలో యువకుడు శివ నివాసం ఉంటున్నాడు. కాగా.. శివ పలు లోన్ యాప్స్ లో లోన్ లు తీసుకున్నాడు. అయితే లోన్ యాప్స్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో.. తల్లిదండ్రులు లేనిది చూసి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని శివ మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. అనంతరం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Saree: చీరకట్టు భామను హీరోయిన్ ను చేసిన ఆర్జీవి..శ్రీలక్ష్మీ సతీష్ ‘శారీ ‘పోస్టర్ వైరల్..