ఆహారం, పానీయాల విషయంలో చైనా ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పాకేవి, దేకేవి,ఈదేవి, ఎగిరేవి, తేలేవి అది, ఇది అని తేడాలేకుండా అన్నింటికీ లాగించేస్తారు చైనీయులు. అయితే మీరు నమ్మలేని మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సీఎమ్పీ వార్తల ప్రకారం… 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిల మూత్రం ఇక్కడ సేకరిస్తారు. ఇందులో.. నవజాత అబ్బాయికి ఒక నెల వయస్సు వచ్చే ఒక రోజు ముందు, మొదటి ఉదయం మూత్రం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు. నిజానికి.. ఈ ఆచారం వెనుక ఒక ఆశ్చర్యకరమైన సంప్రదాయ నమ్మకం ఉంది. సాంప్రదాయ చైనీస్ సంస్కృతిలో బాలుర మూత్రంలో వివిధ ‘ఆధ్యాత్మిక శక్తులు’ ఉన్నాయని చాలా కాలంగా వారి నమ్మకం. ఇవి యాంగ్ శక్తిని ప్రోత్సహించడం, జ్వరాన్ని తగ్గించడం నుంచి ఆధ్యాత్మిక ప్రయోజనాల వరకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. దుష్టశక్తులను దూరంగా ఉంచడం, అదృష్టాన్ని ప్రోత్సహించడం కూడా వీటిలో ఉన్నాయట.
READ MORE: Yagi Typhoon Myanmar : మయన్మార్‌లో యాగీ తుఫాను బీభత్సం.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు
చరిత్రాత్మకంగా, రసవాదులు చక్రవర్తులకు ముందు ఈ అబ్బాయిల మూత్రాన్ని ‘అమర నీరు’గా ఉపయోగించేవారట. ఇది స్వచ్ఛమైన యాంగ్ శక్తిని సూచిస్తుందని ఇప్పటికీ నమ్ముతారట. అది అమరత్వాన్ని అందించగలద వారు పేర్కొంటున్నారు. మింగ్ రాజవంశానికి చెందిన జియాజింగ్ చక్రవర్తి (1368-1644) నిత్య జీవితం కోసం తన అన్వేషణలో తన అమృతం తయారీలో దీనిని ప్రత్యేకంగా ఉపయోగించారని చైనీయులు చెబుతున్నారు. 1987 చలన చిత్రం మిస్టర్ వాంపైర్‌లో తావోయిస్ట్ పూజారి పాత్రను హాంగ్ కాంగ్ నటుడు లామ్ చింగ్-యింగ్ పోషించాడు. మంత్రగత్తెని ఓడించడానికి బాలుడి మూత్రాన్ని ఉపయోగించాడు. కానీ పురాతన జానపద కథలలోని ఈ చికిత్స వల్ల మూత్రం వాడే వారి రోగాలు మూత్రం వాడిన పిల్లలకు సంక్రమిస్తాయనే నమ్మకం వంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
READ MORE: East Godavari: వృద్ధ దంపతుల ప్రాణం తీసిన కోతి
జియాంగ్‌లో ఏకంగా టాయిలెట్ తోనే వంటను చేస్తారు. డాంగ్‌యాంగ్లో అనే ప్రాంతాల్లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. ఇలా గుడ్లను ఉండికించడానికి మూత్రం కూడా సేకరించడానికి ఒక ప్రాసెస్ కూడా ఉందట. 10 ఏళ్ల లోపు వయసున్న మగపిల్లల నుంచి మూత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సేకరించి ఆ మూత్రంలో గుడ్లు నానబెట్టి ఉడికించి ప్రత్యేక ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. వీటిని ‘Virgin boy egg’ డిష్ అనే పేరుతో లొట్టలేసుకుంటు తినేస్తారు. సంప్రదాయ వంటగా ఇది చాలా ఫేమస్ అట. ఇలా మూత్రం సేకరించడానికి ఫుడ్ స్టాల్స్ వారు స్కూల్స్ లో బకెట్లను పెడతారు. ఆ బకెట్లలో 10 లోపు వయసున్న మగపిల్లలు టాయిలెట్ పోస్తారు. అలా ఆ మూత్రంలో గుడ్లను 7గంటలు నానబెట్టి ఆ తరవాత వాటిని ఉడకబెట్టి.. పైన పెంకు వలిచి అప్పుడు గుడ్లతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. ఈ ఫుడ్ ని తినడం అక్కడవారు సంస్కృతిలో భాగంగా మారిపోయింది.
READ MORE: Ponnam Prabhakar: నిమజ్జన ఉత్సవాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురండి..
మూత్ర గుడ్లతో ఆరోగ్య ప్రయోజనాలు:
మూత్రంతో ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చైనీయుల నమ్ముతారు. మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినటం వల్ల శరీరంలో వేడిని తగ్గించటంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుందని చెబుతుంటారు వీళ్లు. ప్రాచీన కాలంలో గుడ్లు వారి సొంత మూత్రంలో ఏడు రోజులుపాటు ఉంచి..వాటిని మూడు నెలలపాటు తింటే ఆస్తమా హాంఫట్ అయిపోతుందని నమ్మేవారట.