తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను నిర్ణయించడానికి లక్కీ డ్రాను నిర్వహించింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గానూ రికార్డు స్థాయిలో 1,31,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. దీంతో.. ఫీజుల రూపంలో రూ.2500 కోట్లు ప్రభుత్వం ఖజానాకు చేరింది. నేటి లక్కీ డ్రాలో లైసెన్స్ పొందిన వారు ఆగస్టు 21-22 తేదీల్లో మొదటి దశ ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం కొత్త దుకాణాలు డిసెంబర్ 1, 2023 నుండి తెరవబడతాయి మరియు నవంబర్ 30, 2025 వరకు కొనసాగవచ్చు.
Also Read : Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాపై హరీకేన్ హిల్లరీ తుఫాన్ ఎఫెక్ట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఒక్కో దుకాణానికి ఏడాదికి లైసెన్సు ఫీజు రూ. 50 లక్షల నుంచి ప్రాంత జనాభాను బట్టి సంవత్సరానికి రూ.1.1 కోట్లు వరకు వసూలు చేస్తుంది. అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. ఒక జగిత్యాల మినహా మిగతా 33 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో మద్యం దుకాణాల లక్కీ డ్రా పూర్తయ్యింది. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు గాను 22 మద్యం దుకాణాలకు రీ టెండర్లు నిర్వహించాలని ఎక్సైజ్ అధికారుల నిర్ణయించారు. ఆదిలాబాద్ -9, ఆసిఫాబాద్ -5, నిర్మల్ – 4, భూపాలపల్లి – 3, కామారెడ్డి -1 షాపుకు రీ టెండర్లు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 22 షాపులకు అతి తక్కువ టెండర్లు రావడంతో మరోసారి ఔత్సాహికుల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకన్నారు ఎక్సైజ్ అధికారులు.
Also Read : Gang Rape: హైదరాబాద్‌లో దారుణం.. కత్తులతో బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్..