Gang Rape: హైదరాబాద్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు.. గంజాయికి అలవాటు పడ్డ ఓ బ్యాచ్.. బాలికి ఇంట్లోకి దూరి కొత్తులతో బెదరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు.. బాలిక తమ్ముడి ఎదుటే.. పశువుల్లా మారి.. ఆ బాలికపట్ల దారుణంగా ప్రవర్తించారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..
Read Also: Ariyana Glory : ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన అరియనా.. నడుము అందాలతో మత్తెక్కిస్తుందిగా…
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.. మైనర్ బాలికను కత్తులతో బెదిరించిన గంజాయి బ్యాచ్ అఘాయిత్యానికి ఒడిగట్టింది.. ఎవరికైనా చెబితే చంపుతాం అంటూ బెదిరింపులకు దిగారు.. సొంత తమ్ముడి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలి తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో మనస్థాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది.. ఇక, తల్లి చనిపోవడంతో 15 రోజుల క్రితం నందనవనంలోని తన అక్క ఇంటికి దగ్గర్లో కిరాయికి ఉంటున్నారు.. అక్క, తమ్ముడు.. ఎప్పటి లాగానే ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో 8 మంది( గంజాయి బ్యాచ్ ) ఒక్కసారిగా బాలిక ఇంట్లోకి దూరినట్టు చెబుతున్నారు.. బాధితురాలి తమ్మునికి కత్తి చూయించి బెదిరించారు.. ఇక, ఆపై బాలికపై నలుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ ఘటన తర్వాత గంజాయి బ్యాచ్‌కు చెందిన ఆ ఎనిమిది మంది పరారైనట్టు తెలుస్తోంది.. అయితే, ఈ ఘటన విషయంలో మీర్‌పేట్ పోలీసులపై రాచకొండ సీపీ డీహెచ్ చౌహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.