ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
ఏపీలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని యంత్రాంగాన్ని సిద్దం చేయాలని శుక్రవారం కమీషనరేట్ నుండి నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీఅమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు సంయుక్త మీడియా సమావేశంలో మాట�