ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.