రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది.
ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు…