తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ బాటిల్ (750మి.లీ)పై రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హాఫ్ బాటిల్‌పై రూ.20, 180 ఎంఎల్ పై రూ.10లు, 90 ఎంఎల్ పై రూ.5 తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు తేల్చారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. అయితే అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం.. బీర్ల ధరలు మాత్రం తగ్గించలేదు. ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
Also Read : Dwaraka Tirumala Kalyanam: అంగరంగవైభవంగా ద్వారకా తిరుమలేశుడి కల్యాణం