ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ తో పాటు ఇతర ఉగ్రవాదులతో పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్‌లో మరోసారి వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని కూడా నిరసనకారులు పిలుపునిచ్చారు.
Read Also: Atrocious: నిజామాబాద్ లో దారుణం.. బాలికను గర్భవతి చేసిన యువకుడు
అయితే, శనివారం నాడు నిరసనకారులు పెద్ద సంఖ్యలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం చాలా మంది బందీలను తిరిగి తీసుకురావడంలో విఫలమైంది.. బందీల కుటుంబాలు వారిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు. బందీలను విడుపించడంలో నెతన్యాహును విఫలమయ్యారు.. అందుకే దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బ్యానర్లను ప్రదర్శించారు.
Read Also: Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ముచ్చటగా మూడోసారి భూకంపం..
ఇక, తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సిరియా సరిహద్దుకు సమీపంలోని జనతా గ్రామంలో హిజ్బుల్లా శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే, తూర్పు నగరమైన బాల్‌బెక్‌కు సమీపంలో ఉన్న సఫారి పట్టణంపై దాడి జరిగినట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.