Atrocious: చట్టాలుమారుతున్న మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఏదో ఒకచోటు ఆడవారిపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికను ఓ యువకుడు గర్భవతి చేసిన ఘటన ఆగ్రామం ఉలిక్కిపడేలా చేసింది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో 9వ తరగతి చదువుతున్న బాలికను అదేగ్రామానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. తనను రోజూ కలిసేవాడు. మాయమాటలు చెబుతూ బాలికను మెల్లిగా తనవైపు మలుచుకున్నాడు. బాలికను మాటలతో మభ్యపెట్టాడు. రోజూ ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.. అయితే కొన్ని నెల తరువాత బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను కలిస్తే మళ్లీ తనను ఏం చేస్తారో అనేభయంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఏదో కోల్పోయినట్లు ఉడటంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.
Read also: Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు
ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాండూరు మండలంలో 17 ఏళ్ల మైనర్ బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. అయినెల్లి గ్రామానికి చెందిన బూడిద అంబెష్ ఆటో డ్రైవర్… SSC సప్లమెంటరీ ఎగ్జామ్ సమయంలో తన ఆటోలో వస్తున్న మైనర్ బాలికతో పరిచయం చేసుకున్నాడు. ఈనెల 4న తాండూర్ లో ఒక పెళ్ళికి హాజరైన మైనర్ బాలికు మాయమాటలు చెప్పి ఇంటిదగ్గర దిగబెడతానని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తనను అయినెల్లి గ్రామ శివారులోని కంది చేనులోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు.
రాత్రంతా బాలికను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆతరువాత 5వ తేదీ ఉదయం తాండూర్ లోని రైల్వే స్టేషన్ లో బాలికను ట్రైన్ లో ఎక్కించి తన ఇంటికి వెళ్లమని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదని బెదిరించాడు. అయితే ఆ బాలిక నగరంలోని తన బంధువుల దగ్గరికి చేరుకుని, తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.
Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ముచ్చటగా మూడోసారి భూకంపం..