అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ తో పాటు ఇతర ఉగ్రవాదులతో పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్‌లో మరోసారి వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Early Elections: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఒక్కసారి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా విపక్షాలు ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అంచనా వేస్తున్నాయి. సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ముందస్తు ఎన్నికలు అన్నది మీడియా చేస్తున్న హడావిడి, కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదన్నారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు పాలన ఉంటుందని తేల్చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు.