లేడీ అఘోరీకి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. ఇటీవల పూజల పేరుతో తనను లక్షల్లో మోసం చేశాడని ఓ సినీ లేడీ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దద్యాప్తు చేశారు మోకిలా పోలీసులు. ఈ క్రమంలో మోకిలా పోలీసులు లేడీ అఘోరీని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని నగరానికి…
గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరీకి సంబంధించిన మోసం వెలుగుచూసింది. అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అఘోరీపై కేసు నమోదైంది. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25 న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు…