KVP Ramachandra Rao: పురంధేశ్వరిపై జాలి పడుతున్నా.. బీజేపీ చేసిన పనులకు సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVP Ramachandra Rao: భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులైన విషయం విదితమే.. ఆమెకు బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా శుభాకాంక్షలు చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేవీపీ రామచంద్రరావు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పురంధేశ్వరి పట్ల జాలి పడుతున్నానన్న ఆయన.. బీజేపీ చేసిన పనులకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అసలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీయే అని మండిపడ్డారు కేవీపీ.. బీజేపీకి ఉన్న 0.48 ఓటు శాతం ఇంకా తగ్గిపోతోందని జోస్యం చెప్పారు. మరోవైపు.. చంద్రబాబుకు ఒక నిబద్ధత లేదని విమర్శించారు కేవీపీ.. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఘటనా ఘటన సమర్ధుడు అని విమర్శించారు.. రాహుల్ గాంధీతో స్టేజీ పంచుకుని, 2018లో కలిసి పోటీ చేశారు.. కానీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే చంద్రబాబు నోరు మెదపలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ.. 2024లో ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారకపోవచ్చు.. కానీ, సంస్ధాగతంగా బలపడతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Dharmapuri Arvind: కిషన్ రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్.. 2024లో మోడీ మూడోసారి పీఎం అవుతారు
Also Read
- Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
- Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
మరోవైపు.. రోశయ్య, వంగవీటి రంగాతో నాకు వ్యక్తిగత పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు కేవీపీ.. రంగా 1981లో కార్పొరేటర్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.. రంగా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అవ్యజనీయమైన ప్రేమ ఉండేది.. వంగవీటి మోహన రంగా సేవా భావాన్ని, విశ్వసనీయతని రాజశేఖర్ రెడ్డి గుర్తించారు.. రాజశేఖర్ రెడ్డి నమ్మి అప్పజెప్పిన బాధ్యతలను రంగా నెరవేర్చారు.. కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఏర్పడటానికి రంగా కృషి చేశారు.. ఎందరో యువకులు రంగా స్ఫూర్తితో రాజకీయాలలోకి వచ్చారని.. రంగా 1985లో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. కానీ, అసాంఘిక శక్తుల చేతుల్లో రంగా అమరుడయ్యాడు.. రంగా బలిదానం కాంగ్రెస్ గెలుపులో ఎంతోకొంత పాత్ర వహించిందన్నారు.. రంగా మరణంతో చాలాకాలం టీడీపీ తెర మరుగైపోయిందని పేర్కొన్నారు కేవీపీ రామచంద్రరావు.
తాజావార్తలు
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్‌లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?