రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శివ నిర్వాన ఈ సినిమాను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా విడుదల అయిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంత గానో నచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ .30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఖుషి సినిమాకి భారీగా క్రేజ్ ఏర్పడింది.. ఓవర్సీస్ లో అయితే కేవలం రెండు రోజుల లోని మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది.ఈ సినిమా తో సమంత మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది..
సౌత్ ఇండియాలో నే ఏ హీరోయిన్ కు కూడా ఇలాంటి రికార్డు ఇప్పటివరకు రాలేదు సమంత నటించిన 17 చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి అలా సమంత ఖాతా లో ఇప్పుడు అరుదైన రికార్డు దక్కించుకుంది ఖుషి చిత్రం.ఖుషి సినిమా మొదటి రోజు రూ.30 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా తెలుస్తోంది.అలాగే .రెండవ రోజు కూడా భారీ స్థాయిలోనే రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తుంది… ఫలితంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ .6 కోట్ల రూపాయల వరకు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక యూఎస్ఏ లో వన్ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజులలేనే రూ 51 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేసింది . మరి ఈ సినిమా పూర్తి థియేటర్ రన్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.