Kurnool Bus Fire Accident: కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే..
Viral Video: మందు ఇలా కూడా తాగొచ్చా.. ఇదిఎలా సాధ్యం గురూ..!
ఈ ఘటనలో తేలని 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ జరిగింది. త్రిమూర్తి హైదరాబాద్ కు వచ్చి రిజర్వేషన్ లేకుండా ఆరంగర్ సర్కిల్ వద్ద బస్సు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అలా బస్సు ఎక్కిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు మొబైల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ అతను అందుబాటులోకి రాలేదు. దానితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కర్నూలుకు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత ఆ అంతుచిక్కని 19వ వ్యక్తికి డిఎన్ఏ టెస్ట్ జరిపి అమృతదేహం త్రిమూర్తిదే అని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో బస్సు దుర్ఘటనలో మరణించిన మొత్తం 19 మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.
Cyclone Mentha Effect: ‘మెంథా’ తుఫాను ప్రభావం.. పాఠశాలలకు సెలవులు.. ఏ జిల్లాలో ఎన్ని రోజులంటే..!