Viral Video: భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం నుంచి ఎక్కువ శాతం ఆదాయం రావడం తెలిసిన విషయమే. మందుబాబులు మద్యం కొనుగోల ద్వారా వారు చెల్లించే ట్యాక్స్ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతోంది. మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి వారి స్టైల్ లో దాని తాగడం మనం చూసే ఉంటాము. మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టైల్. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాము. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మందుబాబులు కూడా ఆశ్చర్యపోతున్నారంటే నమ్మండి.. అవునండి బాబు.. మీరు కూడా ఈ వీడియో చూస్తే అలా ఎలా తాగేసావు..? అని అంటారు కాబోలు.. మరి ఆ వైరల్ వీడియో గురించి ఒకసారి చూసేద్దామా..
Cyclone Mentha Effect: ‘మెంథా’ తుఫాను ప్రభావం.. పాఠశాలలకు సెలవులు.. ఏ జిల్లాలో ఎన్ని రోజులంటే..!
ఎంత స్టైల్, ఎంత కాస్ట్లీ అయినా సరే.. సరే చివరికి మధ్యాన్ని నోటితో తాగడం కామన్. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మద్యాన్ని నోటితో కాకుండా ముక్కుతో తాగడం అందరిని ఆశ్చర్యానికి పనిచేస్తుంది. వీడియోలో గమనించినట్లయితే.. ఓ మందు బాబు ఎంతో ఉత్సాహంగా మందు తాగడం గమనించవచ్చు. మొదట ఓ పెద్ద బీరు గ్లాసును చేతుల్లో పట్టుకొని ఏదో దేవుడు ఒళ్ళోకి వచ్చినట్లుగా రెండు మూడుసార్లు ముందుకు వెనక్కి ఊగిన తర్వాత.. ఆ గాజు గ్లాసులోని బీరును ముక్కు వద్దకు తీసుకొని వచ్చి.. ఒక్కసారి కూడా కిందకి దించకుండా మొత్తం గ్లాసులోని బీరును ముక్కు ద్వారా తాగాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్ చేస్తున్నారు.
Fire-Bolt Talk: పిచ్చెక్కించే ఆఫర్.. రూ. 11,999 విలువైన ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ జస్ట్ రూ. 999కే
కొందరు సోషల్ మీడియా నేటిజన్స్ అయితే అలా ఎలా తాగేసాడు అండి బాబు.. అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరెమో.. అలా తాగాకా అతడు ఇంకా బతికే ఉన్నాడా..? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎంతోమంది మందుబాబులను చూశాను కానీ.. నువ్వు చాలా స్పెషల్ గురూ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ చేయండి.