సాధారణంగా మగవాళ్లు కొంచెం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లు గా ఉంటారు. ఇంటిని క్లీన్ చేసే విషయంలో ఆడవారిదే పై చేయి ఉంటుంది. ఆడవాళ్లు జాబ్ చేసినప్పటికి ఇంటిని మాత్రం చక్కగా.. అందంగా సర్థుకుంటారు. మగవాళ్లకు మాత్రం అంత ఓపిక, ఇంటరెస్ట్ ఉండదు. అయితే ఇళ్లు నీట్ గా ఉంచడం లేదనే కోపంలో ఓ భార్య .. భర్తపై కత్తితో దాడి చేసింది.
Read Also: KTR: ఆటోలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల చంద్రప్రభ సింగ్ అనే మహిళ ఈ నెల ప్రారంభంలో తన భర్త అరవింద్ మెడను కత్తితో దాడి చేసింది. ఆమె నార్త్ కరోలినా షార్లెట్‌లోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నార్త్ కరోలినాలోని షార్లెట్ లో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. కేవలం ఇళ్లు నీట్ నీట్ ఉంచలేదన్న కోపంతో ఆమె అతడిపై దాడిపై తెగబడింది. చంద్రప్రభ సింగ్ అనే మహిళకు తన భర్త అరవింద్ కు మధ్య ఇళ్లు శుభ్రం చేసే విషయంలో గొడవ జరిగింది. గొడవ కాస్త ముదిరింది. కోపాన్ని తట్టుకోలేని ఆ మహిళ ఏకంగా కత్తితో భర్త మెడ భాగంలో కోసింది. దీంతో భర్తకు రక్త స్రావం జరిగి.. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.
Read Also:Two Womens Fight For Men: ఇదేందయ్యా ఇది.. ఒక మగాడి కోసం.. ఇద్దరు అమ్మాయిలు
ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. విచారణ చేపట్టారు.తన చేతిలో కత్తి ఉండటం, అల్పాహారం తయారు చేయడం వల్ల ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని సింగ్ దర్యాప్తు అధికారులకు చెప్పాడు. కత్తితో తిరగగానే ప్రమాదవశాత్తు తన భర్త మెడ కోసినట్లు ఆమె చెప్పింది. ఇంటిని శుభ్రం చేయకపోవడంతో తన భార్య ఉద్దేశపూర్వకంగా కత్తితో తనపై దాడి చేసిందని భర్త పోలీసులకు చెప్పాడు. అనంతరం చంద్రప్రభను పోలీసులు అరెస్ట్ చేశారు.