KTR: జన్వాడ ఫాంహౌస్ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. గత పదకొండు నెలలుగా ప్రభుత్వం పై పోరాడుతున్నామని, ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విదంగా ప్రశ్నిస్తున్నామన్నారు. మమ్ములను రాజకీయంగా ఎదుర్కోలేక.. మా కుటుంబ సభ్యుల మీద, మా మీద మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిన్నటి నుంచి ఒక ప్రహసనం గా చేస్తున్నారని, అది ఫార్మ్ హౌస్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. నా బావమరిది ఉండే ఇల్లు ఇళ్ళల్లోకి పోయినప్పుడు అందరినీ పిలవలేదని, అందుకే ఇప్పుడు పిలిచారని, ఇది రేవ్ పార్టీ అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మా అత్తమ్మ కూడా ఉన్నారు.. చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. భార్య భర్తలను పట్టుకొని… పురుషులు, మహిళలు అని విడదీసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Anantham Teaser: లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
24 గంటలు శోధించి ఏమి పట్టుకున్నారని, పొద్దున ఎక్సైజ్ సూపర్‌వైజర్ ఏమి దొరకలేదు అని చెప్పారని, అందరికి యూరిన్ టెస్ట్ చేశారని.. ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. నా బావమరిది కి నెగటివ్ వచ్చిందని, ఉదయం నుంచి హడావుడి చేసి సాయంత్రం NDPS కేస్ లు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబ్ లు అంటే ఏమో అనుకున్నామని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని, నేను అక్కడే ఉన్నాను..ఐదు నిమిషాల ముందే వెళ్ళాను అని వార్తలు వేశారని, ఇలా పద్దతి లేకుండా వేయడం ఎంత వరకు కరెక్ట్ అని, మీరు జైళ్లకు పంపినా మేము వెనక్కు తగ్గమన్నారు కేటీఆర్.
Talasani Srinivas Yadav : పొలిటికల్‌గా చూసుకోవాలి కానీ.. వ్యక్తిగతంగా వెళ్తున్నారు