BRO Trailer Release time fixed: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తున్న బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమా కరెక్ట్ గా మరొక వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తమిళ నటుడు, సముద్రఖని తమిళ్ లో తెరకెక్కించిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అతి తక్కువ కాలంలో 100 సినిమాలు నిర్మించాలనే టార్గెట్ పెట్టుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు, టీజర్, పోస్టర్లు ఆకట్టుకోగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేశారు. నిజానికి ట్రైలర్ ని జూలై 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించినా కొద్దిసేపటి క్రితం ఈ ట్రైలర్ కి టైం కూడా ఫిక్స్ చేశారు. జూలై 22 సాయంత్రం 6.3 నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది
నిజానికి ఈ సినిమా రీమేక్ అయినా కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేశామని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ ని రెండు చోట్ల ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. విశాఖపట్నం అలాగే హైదరాబాదులో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. విశాఖపట్నం జగదాంబ థియేటర్ లో సాయి ధరంతేజ్, టీజీ విశ్వప్రసాద్ అతిధులుగా హైదరాబాద్ దేవి 70mmలో సముద్రఖని, కేతికశర్మ అతిధులుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఇలా ఒక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని రెండు చోట్ల నిర్వహించడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి అనే టాక్ కూడా వినిపిస్తోంది.