Nama Nageswara Rao Met Railway Minister Ashwini Vaishnav In Delhi: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఖమ్మం జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి నామా తీసికెళ్లారు. ప్రధానంగా.. ప్రతిపాదిత ‘డోర్నకల్ – మిర్యాలగూడ’ రైల్వే లైన్ అలైన్మెంట్‌ను మార్చాలని కోరారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అందుకు పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోకపోతే.. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలామంది రైతులు తమ భూములు కోల్పోతారని మంత్రికి నామా వివరించారు.
Vinayakan: అసలు సీఎం ఎవరు.. అతను మంచి వ్యక్తి అని ఎవరు చెప్పారు.. ?
నాలుగు హైవేలు, నాగార్జున సాగర్ కాలువ కింద.. ఇప్పటికే ఆ మండలాల్లో చాలామంది రైతులు వందలాది ఎకరాల వ్యవసాయ భూముల కోల్పోయారని తెలిపారు. ప్రతిపాదిత రైలు వల్ల జిల్లాకు ఒనగూడే ప్రయోజనం లేదని తెలియజేశారు. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల్లో రైల్వే లైన్ కింద పోయే వ్యవసాయ భూములు ఎంతో విలువైనవని చెప్పారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నామ నాగేశ్వరరావు వినిపించిన వినతులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిసింది.
Yamuna River: యమునా మళ్లీ ఉగ్రరూపం.. మరోసారి ప్రమాదస్థాయిని దాటి..