నటి లయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా ఎంతగానో అలరించింది ఈ భామ. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది ఈ భామ. పెళ్లి తర్వాత భర్త, పిల్లల్ని చూసుకుంటూ అక్కడే ఐటీ జాబ్ చేస్తూ స్థిర పడిపోయింది. అయితే సినిమాలకు దూరంగా వున్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.ఇక తను కూడా ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంది.తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తన డాన్స్ వీడియోలకు ఆమె ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ చేస్తుంటారు.. తన ఫాలోవర్స్ తనకు కామెంట్స్ పెడితే వెంటనే వారికి రిప్లై కూడా ఇస్తూ ఉంటుంది లయ.
ఈ భామ ఆ మధ్య ఇండియాకి వచ్చి వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంది. తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన భర్త డాక్టర్ అని తమకు రెండు మూడు హాస్పిటల్స్ కూడా ఉన్నాయని తెలిపింది..లయ అభిమానులు ఆమె టాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు ఎప్పుడూ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు వారి కోరిక తీరబోతుంది.ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా లయ కు ఫోన్ చేసి తమ సినిమాలో చెయ్యమని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడని సమాచారం.దీనితో ఆమె ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని సమాచారం.ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో లయను తీసుకోగా తనకు సినిమాలో కీలకమైన క్యారెక్టర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.