Koti Deepotsavam 2024 -LIVE Day -17: భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024 చివరి దశకు చేరుకుంది. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు శివపరివారానికి కోటి రుద్రాక్షల అర్చన చేస్తారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, మొట్ట మొదటిసారిగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. నంది వాహనంపై పార్వతి, పరమేశ్వరులు, పల్లకీపై శ్రీరామలింగేశ్వర స్వామి వార్ల అతి గ్రాంభవమైన ఊరేగింపు ఉండనుంది. తమిళనాడు ధర్మపురి ఆధీనం పీఠాధిపతి శ్రీ మాసిల్లమణి దేశిగ జ్ఞానసంబంధ మహాస్వామీజీ గారిచే అనుగ్రహ భాషణం ఉండనుంది. శ్రీ దివి నరసింహ దీక్షితులుచే ధార్మిక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అంతేకాకుండా.. శివలింగాలకు కోటి రుద్రాక్షల అర్చన భక్తులచే చేయించనున్నారు.
భక్తి టీవీ కోటి దీపోత్సవం భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటి, ఇది 2011 నుండి సనాతన ధర్మానికి ప్రాధాన్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది కోటి దీపోత్సవం – 2024 ఎంతో వేడుకగా, ప్రత్యేక పూజలు, కళ్యాణాలు నిర్వహించి, అనేక ప్రఖ్యాత ఆలయ పండితులు, ఆధ్యాత్మిక నాయకుల దివ్య ప్రసంగాలు, ప్రముఖులు సమక్షంలో జరుగుతోంది.
కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్ ప్రైవెట్ లిమిటెడ్.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విధితమే కాగా.. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోందని మీకు తెలియజేస్తున్నాం.