Bengal Tiger Dies in Tirupati Zoo: తిరుపతి జూ లో బెంగాల్ టైగర్ మృతిచెందింది.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ‘మధు’ అనే బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.. బెంగాల్ టైగర్ మధును 11 ఏళ్ల వయస్సులో 2018లో బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు అధికారులు.. ఇప్పుడు మధు వయస్సు 17 ఏళ్లకు పైగానే ఉంది.. బెంగాల్ టైగర్ మధు వృద్ధాప్యంతో చనిపోయినట్టు జూ అధికారులు వెల్లడించారు..
Read Also: RGV : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ పై స్పందించిన లీగల్ టీమ్
కాగా, బెంగాల్ టైగర్ లేదా రాయల్ బెంగాల్ టైగర్ అనేది పాంథెర టైగ్రిస్ ఉపజాతి మరియు నామినేట్ టైగర్ ఉపజాతుల జనాభాగా చెబుతారు.. ఇది ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద అడవి పిల్లులలో ఒకటిగా కూడా పేర్కొంటారు.. దీని చారిత్రాత్మక పరిధి 19వ శతాబ్దం ప్రారంభం వరకు సింధు నది లోయను దాదాపుగా భారతదేశం, పశ్చిమ పాకిస్థాన్, దక్షిణ నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నైరుతి చైనాలో కవర్ చేయగా.. ప్రస్తుతం భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు నైరుతి చైనాలో నివసిస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి.. 2022 నాటికి, బెంగాల్ టైగర్స్ సంఖ్య భారతదేశంలో 3,167–3,682 వరకు ఉన్నాయని ఓ అంచనా ఉంది.. ఇక, ఈ ఏడాది మార్చి 17న కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ బెంగాల్ టైగర్ కన్నుమూసింది.. శ్రీ వెంకటేశ్వర (SV) జూలాజికల్ పార్క్‌లో 2016లో అంధుడిగా జన్మించింది ఆ టైగర్.. దాని క్యూరేటర్ వెల్లించిన వివరాల ప్రకారం.. ఆ టైగర్‌కి 2017 నుండి మూర్ఛ మూర్ఛలు, నాడీ సంబంధిత రుగ్మతలు మొదలయ్యాయి. చికిత్స అందిస్తూ వచ్చాం.. అయితే, గత రెండు రోజులుగా దాని ఆరోగ్యం వేగంగా క్షీణించింది.. మార్చి 17న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పులి చనిపోయినట్టు వెల్లడించిన విషయం విదితమే..