తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
సినీ నటుడు అలీకి రాజ్యసభ ఛాన్స్ ఉందా? అధికారపార్టీ ఈక్వేషన్స్‌కు ఆయన సరిపోయారా? మరో పోస్ట్‌కు అలీ పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఏంటా పదవి? అంతా రాజ్యసభ ఖాయం అనేసుకున్నారుఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం ఊపందుకుంది. అలీకి…
ఆ యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా.. లేక ఆశలకు కత్తెర వేసిందా? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి.. వచ్చిన పదవివల్ల కలిగే లాభనష్టాలేంటి? కేడర్‌లో భిన్నవాదనలెందుకు? ఏ విషయం వారికి అంతుబట్టడం లేదు? అమర్నాథ్‌కు పార్టీ పరంగా కీలక బాధ్యతలువిశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై YCP స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు…