తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
Car Accident: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు. ఆ ఆడి కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్ కులేకు చెందినది. నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆడి మొదట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆపై పోలో కారు, మోపెడ్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధిచి ఇప్పటికి…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో హౌస్ లీడర్‌గా నియమితులయ్యారని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు.
JP Nadda: చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్‌లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్,…
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. రేపు అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించక పోవడం శోచనీయం అని అన్నారు
ఈనెల 15న బీవై విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులైన సంగతి తెలిసిందే. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్‌ను జోడించింది.
BJP Chief Daggubati Purandeswari demands White Paper On Debts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి అధికార వైఎస్సార్ సీపీపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ ఆమె ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో వైయస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్నించారు. దీనికి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే నిన్న పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూర్చి కేంద్ర ఆర్థిక మంత్రి…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు( శుక్రవారం) బాధ్యతలను స్వీకరించారు. అయితే, నాలుగోసారి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ దగ్గర ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.