నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని హోటల్ వివేరా లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో 200 మంది బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వేముల వీరేశం రాకతో కాంగ్రెస్ పార్టీ కి బలం చేకూరిందన్నారు. కేసీఆర్ లాగా మాకు పిట్టకథలు చెప్పి ప్రజలను మాయ చేయరాదని, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంను ఇచ్చిందన్నారు.
Also Read : China: నేరుగా దాడిచేయలేక.. పండుగను అడ్డం పెట్టుకుని వెన్నుపోటుకు రెడీ అయిన చైనా
కేసీఆర్ కు మస్తి ఎక్కి కాంగ్రెస్ పార్టీ నీ బేకర్ పార్టీ అంటుండని, 45 రోజుల తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేయాలి కేసీఆర్ అంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మహిళా ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురి చేశాడు నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య అని, ఒక్క ఓటుకు 5 వేలు డబ్బులు ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ఇచ్చిన డబ్బులు తీసుకోనీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ కే వేయాలని వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లలో గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సెకండ్ లిస్ట్ లోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని, కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తామన్నారు. టికెట్లు రానోళ్లు నిరాశ చెందవద్దు. అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అందుకోసం అందరూ కలసికట్టుగా పని చేయాలి అని పిలుపునిచ్చారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు.