ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.
నిన్న తిరుమల శ్రీవారిని 18010 మంది భక్తులు దర్శించుకున్నారు. 8652 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.77 కోట్లుగా ఉంది. అయితే రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇక 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం చేయనున్నారు. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. అలాగే 30,31వ తేదిలలో హనుమజన్మస్థలం అంశం పై టీటీడీ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతులు, పరిశోధకులు పాల్గోనున్నారు.