తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు.
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి…
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేశారు టీటీడీ అధికారులు..
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500…
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. టీటీడీ…
ఈ నెల 13వ తేదీన జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… జమ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరగనుంది… రెండో దశలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది…