Kodali Nani: 50 రోజుల్లో జగనే మళ్లీ సీఎం అవుతారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనుక నుంచి భౌతికంగా తొలగించాలని చంద్రబాబు కుట్ర చేశారు.. కానీ, దేవుడు, ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ కు ఏమీ కాలేదన్నారు. 50 రోజుల్లో జగన్ మళ్లీ సీఏం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఓటు కోసం అబద్ధం చెప్పని వ్యక్తి జగన్ మాత్రమే అని ప్రశంసలు కురిపించారు. జగన్ ను గెలిపించి చంద్రబాబు ప్రజలు పాతేస్తారని హెచ్చరించారు.. వైఎస్ జగన్ ను ఏమైనా చేయాలి అంటే చంద్రబాబు మళ్లీ ఇంకో జన్మ ఎత్తాలని పేర్కొన్నారు కొడాలి నాని.
Read Also: Oman Floods: ఒమన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు
ఇక, తన పరిపాలనలో స్కూల్‌కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు కొడాలి.. జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజలకే అందిస్తుందన్నారు. గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నేత జగనే అని ప్రశంసించారు. మరోవైపు, ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్.. అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు అంటూ హాట్ కామెంట్లు చేశారు కొడాలి నాని..