వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు.
జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం... పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు.
ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు.…
రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ‘మేమంతా సిద్ధం ‘ అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రసంగిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. Also read: Teja Sajja: హను-మాన్ తరువాత తేజ సజ్జా సినిమా ఇదే.. రేపే అధికారిక ప్రకటన! ఇకపోతే ఏప్రిల్ 13 శనివారం నాడు మేమంతా సిద్ధం బస్సు…
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.