తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు( శుక్రవారం) బాధ్యతలను స్వీకరించారు. అయితే, నాలుగోసారి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ దగ్గర ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
Read Also: Viral News: డ్రిల్ మెషిన్‌తో తలకు రంధ్రం.. మెదడుకు శస్త్రచికిత్స..!
శాసన సభ ఎదురుగా గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల ప్రభాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: World Bank Chief: తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్.. మరో ఐదేళ్లలోనే..!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తీవ్రంగా కష్టపడాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో నేతలను అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావటం, బీజేపీలో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టటంతో పాటు, అధికార బీఆర్ఎస్ పై బలమైన నిరసన గళాన్ని వినిపించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అంతేకాదు బీజేపీని పక్కకు నెట్టి దూసుకుపోతున్న కాంగ్రెస్ కు సైతం చెక్ పెట్టి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని చెప్పాల్సిన అవసరం కిషన్ రెడ్డికి ఉంది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్రమంత్రి వర్యులు శ్రీ @kishanreddybjp గారు బాధ్యతలు స్వీకరణ pic.twitter.com/v3CEJ6DBpp
— BJP Telangana (@BJP4Telangana) July 21, 2023