భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం.. మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద…
ఈనెల 15న బీవై విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులైన సంగతి తెలిసిందే. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు( శుక్రవారం) బాధ్యతలను స్వీకరించారు. అయితే, నాలుగోసారి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ దగ్గర ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, మీకు గుడ్‌న్యూస్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాప్ నుండి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రూ.2,000 వరకు లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై రూపే క్రెడిట్ కార్డ్ వినియోగానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.. దీనిపై ఇటీవలి ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తోంది మరియు అన్ని ప్రధాన…